మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఊర చెరువు, ఖాతాల్ఖాన్ చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 80వేల చేపపిల్లలు విడిచి.. స్థానిక మత్స్యకారులకు అంకితం ఇచ్చారు. వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానన్నారు.
నియోజకవర్గంలో ఉన్న నాలుగు వందల చెరువులకు జలకళ సంతరించుకుంది. ఫలితంగా పెరిగిన మత్స్య సంపదకు అనుగునంగా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం పురపాలక సంఘం పరిధిలో మూడు ఆటోలతో ఏర్పాటు చేసిన చెత్తసేకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ బస్వరాజ్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: సర్కారీ బడుల్లో 'ఆన్లైన్ విద్య' ఎలా?