ETV Bharat / state

చేతనైతే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవాలి... మంత్రి సవాల్​ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

కేంద్రం నుంచి రాష్ట్రానికి పైసా నిధులు రాబట్టలేని భాజపా నేతలు.. కేసీఆర్​పై విమర్శలు మాని చేతనైతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా నిధులు తీసుకురావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భాజపా నేతలకు సవాల్​ విసిరారు. మద్దతు ధర నిర్ణయించే కేంద్రం పంటల్ని సైతం కొనుగోలు 0చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్న వాళ్లకి కూడా రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని తెలిపారు. ఇటీవల వానలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

ministers inaugurated double bed room houses in mahaboobnagar district
చేతనైతే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవాలి... మంత్రి సవాల్​
author img

By

Published : Oct 31, 2020, 5:21 AM IST

చేతనైతే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవాలి... మంత్రి సవాల్​

కేంద్రం నుంచి రాష్ట్రానికి పైసా నిధులు రాబట్టలేని భాజపా నాయకులు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమించే కేసీఆర్, తెరాస నేతలపై విమర్శలు చేయడం తగదని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చేతనైతే ఆంధ్రప్రదేశ్​లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి నిధులు రాబట్టాలని భాజపా నేతలకు సవాల్​ విసిరారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ మండ‌లం అన్నాసాగ‌ర్‌, నిజలాపూర్​లో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డిలు ప్రారంభించారు. క్రిస్టియన్​పల్లిలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. దేవరకద్ర- వేముల రహదారి, భూత్పూర్-మహబూబ్​నగర్ రహదారిపై అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణాలు, మహబూబ్​నగర్ నూతన కలెక్టరేట్, బైపాస్ రోడ్లను మంత్రులు పరిశీలించారు.

కమళదళంపై విరుచుకుపడిన మంత్రి

అన్నసాగర్​లో ఏర్పాటు చేసిన సభలో కమలదళంపై విరుచుకుపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించే కేంద్రం.. పంటల కొనుగోళ్లు మాత్రం ఎందుకు చేపట్టదని మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్ధి భాజపా నేతలకు కనపించడం లేదా అంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను ఆపార్టీ నేతలు మింగేశారని.. పైసా ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో పేదలను తెరాస సర్కారు రెండు పడక గదులను ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్న వారికి కూడా రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసే యోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని ప్రశాంత్ రెడ్డి వివరించారు.

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలో 26 నూతన కలెక్టరేట్ల నిర్మాణాలను అన్ని రకాల హంగులతో డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన వానలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మహబూబ్​నగర్ - వికారాబాద్ రహదారి సమస్యనూ త్వరలోనే తీరుస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఇప్పటికై మంజూరై ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న రహదారులపై హైదరాబాద్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గుత్తేదారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలాకాలంగా అసంపూర్తిగా మిగిలిన దేవరకద్ర-వేముల రహాదారి, భూత్పూరు నుంచి మహబూబ్​నగర్ వచ్చే దారిలో వంతెనల నిర్మాణంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో 1500 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామ‌ని తెలిపారు.

ప్రథమస్థానంలో నిలుపుతాం..

అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణను కేంద్ర సంస్థలు ప్రశంసిస్తుంటే భాజపా నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, విద్యుత్ లాంటి రంగాల్ని కేంద్రంలోని భాజపా సర్కారు ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ కరెంట్ ఉచితంగా అందిస్తే.. ఉచితంగా ఇచ్చేందుకు వీల్లేందంటూ కొత్త చట్టాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలి బూట్లు నాకుతున్నారంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. ప్రజల కోసం పనులు చేస్తే బూట్లు నాకుతున్నారనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మహబూబ్​నగర్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలుపుతామని దీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు: ప్రశాంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.