నిస్వార్థంగా సమాజానికి సేవ చేసిన వారు ప్రజల మనుస్సులో శాశ్వతంగా గుర్తుండిపోతారని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావరిన్ ఫౌండేషన్, నేను సైతం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం గతంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఆహారం అందించామని..... ఇప్పుడు సావరిన్ పౌండేషన్, నేను సైతం సంస్థలు నిత్యాన్నదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఎన్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందించిన 7 అంబులెన్స్ వాహనాలను ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీరన్నపేటకు చెందిన రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. డబుల్బెడ్రూం ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వానగుట్ట వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కల్యాణ మండపాన్ని ప్రారంభించి.. ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.. కిటకిటలాడిన ఆలయాలు