ETV Bharat / state

SRINIVAS GOUD: 'అత్యాధునిక వసతులతో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం' - telangana varthalu

భవిష్యత్​ పాలమూరు జిల్లా మెడికల్​ హబ్​గా మారనుంది ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనానికి సంబంధించి పత్రాలను సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం జిల్లా వైద్య శాఖ అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఆసుపత్రిని నిర్మిస్తే మెడికల్​ రంగంలో మహబూబ్​నగర్​ అభివృద్ధి అవుతుందని తెలిపారు.

SRINIVAS GOUD: 'అత్యాధునిక వసతులతో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం'

author img

By

Published : Aug 2, 2021, 4:47 PM IST

మహబూబ్​నగర్ జిల్లా భవిష్యత్​లో మెడికల్ హబ్​గా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రస్తుత కలెక్టరేట్ స్థలంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించే విధంగా అత్యాధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముందుగా చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించాలని అనుకున్నా.. జిల్లా అవసరాలను బట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ముఖ్యమంత్రిని కోరడంతో వెంటనే మంజూరు చేశారని మంత్రి తెలిపారు.

కలెక్టర్​ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాలు సమీకృత భవనమైన నూతన కలెక్టరేట్ కార్యాలయంలోకి మారానున్నయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. అందులో భాగంగా పాత కలెక్టరేట్ భవనానికి సంబంధించిన పత్రాలను జిల్లా వైద్య శాఖ అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. మరో రెండు, మూడు రోజుల్లో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన నక్షలను తయారుచేస్తారని వెల్లడించారు. అంతకుముందు మంత్రి కలెక్టరేట్ ప్రాంతాన్ని పరిశీలించారు.

300 కోట్లతో..

మహబూబ్​నగర్​ ప్రస్తుత కలెక్టరేట్​ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం గురించి ముఖ్యమంత్రి గారిని అడిగాం. ఆసుపత్రిని నిర్మిస్తే మెడికల్​ రంగంలో మహబూబ్​నగర్​ అభివృద్ధి అవుతుందని.. వ్యాపార రంగం వృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి గారికి చెప్పగానే వెంటనే ఫైల్​ తెప్పించుకుని సంతకం చేశారు. కొత్త కలెక్టరేట్​కు మారిన తరువాత ఇక్కడ పని ప్రారంభిస్తాం. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. దాదాపు 300 కోట్లతో పెద్ద పెద్ద భవనాలతో సూపర్​ స్పెషాలిటీ నిర్మించబోతున్నాం. -శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి

SRINIVAS GOUD: 'అత్యాధునిక వసతులతో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం'

ఇదీ చదవండి: CM KCR Speech: 'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.