మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. రంజాన్ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని సయ్యద్ మర్దన్ అలీ షాఖాద్రి దర్గా మతాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్ షాఖాద్రిని కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం రోడ్లు భవనాల అతిథి గృహం ఆవరణలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలీంచి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారందరికీ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మూసీ వరదల కారణంగా వందేళ్ల క్రితం రంజాన్‌ను ముస్లింలు ఇళ్లలోనే పండుగ నిర్వహించుకున్నారని.. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు