రాఖీ పండుగ కోసం భార్య పుట్టింటికి వెళ్లగా.. భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పండుగ వేళ కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకోవడం వల్ల గ్రామంలో విషాదం అలుముకుంది. మిడ్జిల్‌కు చెందిన శ్రీశైలం రాఖీ పౌర్ణమి నాడు.. భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు.. వెంటనే శ్రీశైలం ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి కొన ఊపిరితో ఉన్న శ్రీశైలంను జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు