ETV Bharat / state

స్కోచ్ సిల్వర్ అవార్డుకు ఎంపికైన పాలమూరు

పాలమూరు జిల్లాలోని దస్త్రాలను వందశాతం డిజిటలైజేషన్ చేసినందుకు స్కోచ్ సిల్వర్ అవార్డుకు ఎంపికైంది. ఈ కంప్యూటరైజేషన్ ప్రక్రియ వల్ల సులభంగా సమాచారాన్ని పొందవచ్చు. అవార్డుకు ఎంపికయ్యేందుకు కృషి చేసిన జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.

Skoch Silver Award to mahabubnagar, Skoch Silver Award 2021
స్కోచ్ సిల్వర్ అవార్డుకు ఎంపికైన పాలమూరు
author img

By

Published : May 1, 2021, 10:53 AM IST

Updated : May 1, 2021, 10:59 AM IST

మహబూబ్​నగర్ జిల్లాలోని దస్త్రాలను నూరుశాతం డిజిటలైజేషన్ చేసినందుకు స్కోచ్ సిల్వర్ అవార్డుకు ఎంపిక చేసింది. మూడు విడతల ఓటింగ్, చివరగా నిర్వహించిన వర్చువల్ సమావేశం, జ్యూరీ ఓటింగ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కోచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ వెల్లడించారు. కంప్యూటరైజేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో సమాచారాన్ని తక్షణమే పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో రోజుల తరబడి సమయం వృథా అయ్యేది. అందుకే రికార్డు రూమ్ కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్​కు శ్రీకారం చుట్టారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వేర్వేరుగా దస్త్రాలను విభజించారు. స్కోచ్ సిల్వర్ అవార్డుకి జిల్లా ఎంపికైన స్పూర్తితో కలెక్టరేట్​, ఆర్డీవో, మున్సిపాలిటీ కార్యాలయాలను నూరు శాతం డిజిటలైజేషన్ చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట రావు వెల్లడించారు. అవార్డుకు ఎంపికయ్యేందుకు కృషి చేసిన జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి: నేటి నుంచే '18 ప్లస్'​కు టీకా.. కొన్ని రాష్ట్రాల్లోనే!

Last Updated : May 1, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.