ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తెరాస అభ్యర్థి వాణీ దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
భాజపా, కాంగ్రెస్ వైఫల్యాలను వివరించిన మంత్రి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో చెప్పారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగాల విషయంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏనుగొండ, గోల్డ్ పార్క్ కాలనీలో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో ప్రేమ్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హెల్త్ క్లబ్ మహిళలను సన్మానించారు.
ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య