మహబూబ్‌నగర్ కలెక్టరేట్ కార్యాలయంలో పాలనాధికారి ఎస్. వెంకటరావు అధికారులతో సమీక్షించారు. రుణమాఫీకి సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయాల్సిన ఖాతాలను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా క్లస్టర్ స్థాయిలో రైతులకు ఎరువులను అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక ప్రాంతాలలో కాలుష్య నియంత్రణను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. రహదారులకు ఇరువైపులా నాటే మొక్కలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోని ఉంచుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు పురపాలికలలో పొడవాటి మొక్కలను మాత్రమే నాటాలని తెలిపారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్‌పూర్, జడ్చర్ల కమిషనర్లు మొక్కల కొనుగోలుతో పాటు ట్రీ గార్డులను సిద్ధం చేయాలన్నారు.