రాబోయే నాలుగు నెలల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దారులు, ఎంపీడీవోలతోపాటు మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. వర్షాలు ప్రారంభమైనందున పనులలో వేగం పెంచాలని అందుకనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
తక్షణమే గ్రామాల వారీగా గుంతలు తీయటంతోపాటు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా హరిత వనాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాలతోపాటు జిల్లాలోని మూడు పురపాలికల్లో కనీసం ఎకరా విస్తీర్ణంలో మియావాకి ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ తీసుకోవాల్సిన చర్యలతోపాటు మిషన్ భగీరథ పనులను సమీక్షించారు.