మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటరావు సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతులు వేసిన పిటిషన్ల గురించి న్యాయవాదులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూ పరిహారం వంటి తదితర అంశాలపై సంబంధిత అధికారులకు వివరించారు.
రైతులు వేసిన పిటిషన్‌లకు సంబంధించి... సంబంధిత ఆర్డీవో, సర్వే, పంచాయతీరాజ్ అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకున్నట్లు కలెక్టర్ వివరించారు. మక్తల్ మండలానికి సంబంధించిన రైతుల తరఫు న్యాయవాది రెండు వారాల గడువు అడిగినట్లు వెల్లడించారు. మాగనూరు మండల రైతులకు సంబంధించిన వాదనలను రిజర్వ్ చేసి కౌంటర్ పాస్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: జూన్‌లో విస్తారంగా వర్షాలు.. గతేడాది కన్నా 65% అధికం