మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రైల్వేస్టేషన్ సమీపంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. చైతన్యనగర్, మదీనా కాలనీ, గాంధీ చౌక్, మాంసం మార్కెట్ ప్రాంతాల్లో తిరుగుతూ కన్పించిన వారిపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో సుమారు పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
టీకాలు కూడా లేవు...!
ఓవైపు పిచ్చి కుక్క చేస్తున్న దాడికి భయంతో వణికిపోతున్న స్థానికులకు ఆస్పత్రిలో రేబిస్ వ్యాధి టీకాలు లేకపోవటం తీవ్ర ఆందోళన కలిగించింది. అత్యవసర సమయంలో టీకాలు లేకపోవటమేమిటని బాధితుల బంధువులు ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న మార్కెట్ ఛైర్మన్ మురళి.... జిల్లా అధికారులతో మాట్లాడి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే పిచ్చికుక్కను పట్టుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్