మహబూబ్నగర్ పట్టణం మంచు దుప్పటి కప్పుకుంది. వేకువజాము నుంచి విపరీతంగా మంచు కురుస్తూ... ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటలు దాటినా... సూర్యుడు జాడ లేకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోజువారీ పనుల నిమిత్తం బయటికి వెళ్లే రోడ్డు మార్గం సరిగా కన్పించకపోవటం వల్ల జనాలు కొంత ఇబ్బందికి గురయ్యారు. పట్టణం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర మంచు కమ్మేసింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు