ETV Bharat / state

మినీ పోల్స్​: సర్వం సన్నద్ధం... లెక్కింపే తరువాయి - మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సన్నద్ధమైంది. కొవిడ్ నిబంధనలకు లోబడి కరోనా నెగెటివ్ ధ్రువపత్రం ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకూ కొనసాగనుంది. దాదాపు మూడు పురపాలికల ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం 3 గంటల సమయానికి వెలువడే అవకాశం ఉంది.

everything is ready for counting in municipalities

author img

By

Published : May 2, 2021, 10:25 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జడ్చర్ల పురపాలిక ఓట్ల లెక్కింపు బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగనుంది. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డులు ఉండగా... 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెరాస-27, కాంగ్రెస్-25, భాజపా-22, సీపీఐ-3, సీపీఎం-1, ఎంఐఎం-7 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా.. అన్ని వార్డుల్లో కలిపి 27 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం సోమవారం సాయంత్రం తేలనుంది. మొత్తం 41,761 మంది ఓటర్లు ఉండగా... 27,813 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 5 హాళ్లు, 19 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 27 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 54 మంది కౌంటింగ్ సహాయకులను నియమించారు. పోలీసులతో కలుపుకుని 350 మంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. లెక్కింపు కేంద్రంలోకి ఎవరు ప్రవేశించాలన్నా... కొవిడ్ లేనట్లుగా ధ్రువపత్రం తప్పనిసరి చేశారు. అందుకు రాపిడ్, యాంటిజెన్ పరీక్షలను సైతం నిర్వహించి ధ్రువపత్రాలు అందజేశారు. సిబ్బందికి ఎన్-95 మాస్కులు, ఫేస్​షీల్డ్​లు, శానిటైజర్లు, గ్లౌజులు అందించనున్నారు. పోలీసులు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు.

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. జేఎంజే హైస్కూల్​లో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అచ్చంపేటలో మొత్తం 20 వార్డులు ఉండగా... 66 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా 20 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా... అన్ని వార్డులు కలిపి ఆరుగురు స్వంతత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం వీరి భవితవ్యం తేలనుంది. అచ్చంపేట పురపాలికలో మొత్తం 20684 మంది ఓటర్లుండగా 14055 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 68 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కోసం ఒక హాల్, ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. 2016 ఎన్నికల్లో విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడి తెరాసకు పోటీగా నిలబడినా.. 20 వార్డులకు 20 వార్డులు తెరాసనే గెలుచుకుంది. ఈసారి అదే రికార్డును తిరగరాయాలని తెరాస ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో కలిసి పోటీచేసిన విపక్షాలు ఈసారి వేర్వేరుగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్, భాజపా అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపాయి. ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే ఉండనుంది.

కొత్తూరు పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం సిద్ధమై ఉంది. కేజీవీబీ పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేయగా... మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. కొత్తూరులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. తెరాస-12, కాంగ్రెస్-12, భాజపా-12 అన్నివార్డులు కలుపుకుని స్వతంత్ర అభ్యర్థులు 11 మంది బరిలో ఉన్నారు. మొత్తం 8222 ఓట్లర్లుండగా... 7023 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తూరులో మొదటిసారిగా పురపాలిక ఎన్నికలు జరుగుతుండగా... అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పోటీ తెరాస- కాంగ్రెస్ మధ్య ఉండనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ దాదాపుగా అన్నివార్డుల ఫలతాలు వెలువడే అవకాశముంది.

ఇదీ చూడండి: భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.