బెంగాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది, వైద్య విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రి నుంచి తెలంగాణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి.. ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో మెమోరాండం సమర్పించారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని.. కానీ దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఆసుపత్రిలో పని చేసే వారందరికీ రక్షణ కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: జగన్తో సమావేశమైన కేసీఆర్