ETV Bharat / state

కరోనా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే! - mahabub nagar news

కరోనాకు భయపడకండి.. ధైర్యంగా ఉండండి. సమయానికి భోజనం, మందులు వాడండి అంటూ మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కరోనా బాధితులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలంలో ఆయన పర్యటించారు. క్వారంటైన్​లో ఉంటున్న బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Devarakdra MLA Visits Corona Patients Houses
కరోనా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే!
author img

By

Published : Aug 23, 2020, 10:44 PM IST

మహబూబ్​ నగర్​ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డిలో పర్యటించారు. కరోనాతో బాధపడుతున్న పలువురిని ఆయన పరామర్శించారు. నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వడ్డేమాన్​ గ్రామంలోని కరోనా బాధితుల నివాసాలకు వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ వారికి ధైర్యం చెప్పారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో ఉంటున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.

సమయానికి తింటూ.. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే కోలుకోవడం సులువే అని.. కరోనా వల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన బాధితులకు చెప్పారు. బండర్​పల్లి వాగుపై నిర్మించిన చెక్​డ్యాంలో.. కార్యకర్తలతో కలిసి ఊక చెట్టు వాగును తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. మత్స్యకారుల నుంచి గాలాలు తీసుకొని కొద్దిసేపు చేపలు పట్టారు. కరోనా బాధితుల విషయంలో.. ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.