ETV Bharat / state

పాలమూరులో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా ఐదు కేసులు

author img

By

Published : Jun 11, 2020, 1:33 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహబూబ్​నగర్​ జిల్లాలో రెండు, నారాయణపేట జిల్లాలో ఒకటి, నాగర్​కర్నూలు జిల్లాలో రెండు పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు పాలమూరులో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. హైదరబాద్​లో కరోనా వచ్చిన ఒక్క వ్యక్తి వల్ల ప్రైమరీ కాంటాక్ట్​లో ఉన్న 42 మందిని హోం క్వారంటైన్​కు తరలించారు.

corona cases update in mahabubnagar district
పాలమూరులో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా ఐదు కేసులు

ఉమ్మడి పాలమూరులో కొవిడ్​ వైరస్​ విజృంభిస్తోంది. తాజాగా మహబూబ్​నగర్​లో రెండు కేసులు నిర్ధరణయ్యాయి. నాగర్​కర్నూలు జిల్లా బల్మూర్​ మండలంలో ఓ వ్యక్తి కరోనాతో మరణించగా... అతని అంత్యక్రియలు గ్రామంలోనే చేపట్టారు. అక్కడికి హాజరైన 14 మందిలో ఇద్దరికి వ్యాధి సోకినట్లు కలెక్టర్​ ప్రకటించారు.

నారాయణపేట జిల్లా మద్దూరులో ఒకరు అనారోగ్యానికి గురై మహబూబ్​నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అనుమానంతో పరీక్షలు చేయగా రిపోర్టులో పాజిటివ్​ వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా గొర్లఖాన్​ దొడ్డికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు.

ఒక్క వ్యక్తి వల్ల క్వరంటైన్​లో 42 మంది

హైదరాబాద్​ బోడుప్పల్​లో నివాసముంటున్న వ్యక్తి కరోనా ఉందని తెలీక.. వనపర్తి జిల్లా బండరావిపాకుల, రేవల్లి మండల కేంద్రాల్లో భూపంచాయతీ విషయమై వచ్చి వెళ్లాడు. తర్వాత ఆయనకు వైరస్​ ఉందని తెలిసి.. అతనికి ప్రైమరీ కాంటాక్టులైన 30 మందిని హోం క్వారంటైన్​కు తరలించారు. అదే వ్యక్తి నాగర్​కర్నూలు జిల్లా సింగోటంలో వేడుకకు హాజరుకాగా.. అక్కడ 12 మందిని స్వీయనిర్బంధంలో ఉంచారు.

అధికారులతో కలెక్టర్ సమావేశం

కరోనా ఉద్ధృతి పెరుగుతున్నందున జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్​ వెంకట్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో తెరుచుకున్న ప్రతి దుకాణాన్ని ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న పీపీయూనిట్​ను ప్రత్యేకంగా కొవిడ్ జిల్లా ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని, ఎస్వీఎస్​ ఆస్పత్రిలో ఐసోలేషన్​ కేసులను చూసేందుకు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఇవీ చూడండి: గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.