జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం అత్యధికంగా 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు పోలీసు సిబ్బందితోపాటు ఉద్యోగులు ఉన్నారు.
కొత్త కేసులతో జిల్లాలో బాధితుల సంఖ్యం 335కు చేరింది. మహబూబ్నగర్ పట్టణంలో పలు కాలనీలకు చెందిన 39 మంది కోవిడ్ బారిన పడ్డారు. జడ్చర్లలో 9, బాలానగర్‌లో 3 కేసులు నమోదు కాగా.. సీసీకుంట, బోయపల్లి, ధమాయపల్లి, రాజాపూర్లలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 161 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం మల్లగుల్లాలు.. పీఠం ఎవరికి దక్కేనో..!