ETV Bharat / state

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తగ్గుతున్న కరోనా కేసులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదించింది. ఈ నెల 9న 618 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆదివారం నాటికి సంఖ్య 258కి తగ్గడం విశేషం.

author img

By

Published : Sep 15, 2020, 7:40 AM IST

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తగ్గుతున్న కరోనా కేసులు
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తగ్గుతున్న కరోనా కేసులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కరోనా వైరస్​ సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. వరుసగా ఈనెల 9న 618 కేసులు, 10న 526, 11న 438, 12న 364, 13న 258 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మహమ్మారి విజృంభన తగ్గింది.

నాగర్​కర్నూల్ జిల్లాలో..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 100, జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తిలో 20 చొప్పున, అచ్చంపేట 16, కొల్లాపూర్‌ 13 కేసులతో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లో 31 కేసులు నమోదయ్యాయి.

మహబూబ్​నగర్ జిల్లాలో..​

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 83, జిల్లా కేంద్రంలో 34, జడ్చర్లలో 19 కేసులు నమోదయ్యాయి. వివిధ మండలాల్లో మరో 31 కేసులు నమోదయ్యాయి.

జోగులాంబ గద్వాల జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో 38, జిల్లా కేంద్రంలో 11, అయిజలో 7 కొత్త కేసులు వెలుగు చూడగా .. వివిధ మండలాల్లో 20 మంది కొవిడ్‌ బారిన పడ్డారు.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లాలో 35, జిల్లా కేంద్రంలో 20, పెబ్బేరులో 5 మందితో పాటు ఇతర మండలాల్లో మరో 10 మందికి కొవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి : 'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.