మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ జలాశయంలో ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలు గత 15 రోజులుగా వళ్లూరు సమీపంలో దీక్షలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కొందరు కాంగ్రెస్ నాయకులు దీక్షాస్థలి వద్దకు చేరుకోగా... విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నాయకులకు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: కారు నుజ్జు నుజ్జు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫ్యామిలీ సేఫ్.!