ETV Bharat / state

'పాక్​ ఆక్రమిత కశ్మీర్​పై మాత్రమే చర్చిస్తాం' - central minister purushottam rupala visited mahabubnagar

370 అధికరణ ముగిసిన అధ్యాయమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అభిప్రాయపడ్డారు. మహబూబ్​నగర్​లో భాజపా ఏర్పాటు చేసిన జన జాగరణ్​ అభియాన్​ సభలో ఆయన పాల్గొన్నారు. కశ్మీర్​ అంశంపై అంతర్జాతీయంగా దాయాది దేశం ఒంటరైందన్నారు.

'పాక్​ ఆక్రమిత కశ్మీర్​పై మాత్రమే చర్చిస్తాం'
author img

By

Published : Sep 29, 2019, 6:04 PM IST

ఇకపై పాక్​ ఆక్రమిత కశ్మీర్​పై మాత్రమే చర్చిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా స్పష్టం చేశారు. జన జాగరణ్​ అభియాన్​లో భాగంగా మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భాజపా సభలో ఆయన పాల్గొన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ప్రజలు ఎప్పుడు భారత్​లో అంతర్భాగం అవుతామా అని ఎదురుచూస్తున్నట్లు మంత్రి తెలిపారు. కశ్మీర్​ అంశంపై పాక్​ అంతర్జాతీయంగా ఒంటరైపోయిందన్నారు. 370 అధికరణం ముగిసిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. లద్దాక్​ ప్రజలకు ముందే దీపావళి వచ్చిందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పేర్కొన్నారు. కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కేవలం నెహ్రు అభిమతమేనన్న మంత్రి.. ఆ నిర్ణయాన్ని అప్పడి కాంగ్రెస్​ నేతలు సైతం వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

'పాక్​ ఆక్రమిత కశ్మీర్​పై మాత్రమే చర్చిస్తాం'

ఇవీచూడండి: 'అధికరణ 370 రద్దుకు యావత్ ప్రపంచం మద్దతు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.