కేసీఆర్ ప్రోద్భలంతోనే పోలీసులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం జరిగిందంటూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు నిరసన చేపట్టారు. దుబ్బాక ఎన్నికల సందర్బంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ... భాజపా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని భాజపా శ్రేణులు మండిపడ్డారు.
తెరాస పార్టీ నిరంకుశపాలనను నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ప్రజలను, భాజపా కార్యకర్తలను భయాందోళనకు గురి చేయవద్దని, అక్రమ అరెస్ట్‌లు నిలిపివేయాలని కోరారు.