150 జయంతి పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరిలో సినీ నటుడు సునీల్... ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మనిషి లేకపోయినా ప్రకృతి మనుగడ ఆగదు.. కాని ప్రకృతి లేకపోతే మనిషి మనుగడ లేదని అందుకే అందరూ మొక్కలు నాటాలని ఆయన అన్నారు. దేశంలో ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటినా... 120 కోట్ల మొక్కలు అవుతాయని వ్యాఖ్యానించారు. భూతాపాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసమే తెలంగాణ సర్కారు హరితహరాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. నిమ్మ, శ్రీచందనం, ఎర్ర చందనం, నేరేడు, మామిడి, చింత, ఖర్జూరం లాంటి 22 రకాలు వినియోగించి 6వేల మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా... రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 15వేల మొక్కలు నాటినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు కరుణాకర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ