ఓ మహిళ గార్ల రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పైన పండింటి బాబుకు జన్మనిచ్చింది. విజయవాడ సమీపంలోని కొండపల్లికి చెందిన శైలజ వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఎక్స్ ప్రెస్‌లో మహబూబాబాద్‌కు వెళ్తోంది. ఖమ్మం రైల్వే స్టేషన్ దాటగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు తర్వాత వచ్చే గార్ల రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు.
స్టేషన్ మాస్టర్ సమాచారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో డాక్టర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. శైలజను రైలు గార్ల రైల్వే స్టేషన్‌లో దింపారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల ప్లాట్ ఫాంపై ఉన్న బెంచ్ పైనే తోటి మహిళల సహకారంతో.. ఆమెకు పురుడు పోసి మగ శిశువుకు సురక్షితం కాపాడారు వైద్య సిబ్బంది. తల్లి, బిడ్డ ఆర్యోగం క్షేమంగా ఉన్నప్పటికీ... మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్