మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో లింగ నిర్ధరణ చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న జాటోత్ కల్పన, లూనావత్ జామ్లాల్, బానోతు కాలులను తొర్రూరు డీఎస్పీ వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు.
పద్మావతి నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ యాదగిరి రెడ్డి గత వారం లింగ నిర్ధరణ చేసి అబార్షన్ చేశారు. డాక్టర్ యాదగిరి రెడ్డి(పద్మావతి నర్సింగ్‌హోమ్), డాక్టర్ సబితా(సూర్య అస్పత్రి వరంగల్)వీరిద్దరూ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. వారిని కూడా అతి త్వరలో పట్టుకుంటామన్నారు. లింగనిర్ధరణ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమన్నారు.
ఇదీ చూడండి : రైతుబంధు డబ్బులు తన ఖాతాకు మళ్లించుకున్నాడు