తెరాస ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ ఇంఛార్జీ కొండపల్లి రామచందర్ రావు ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు దీక్ష చేశారు. లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నామన్నారు. సర్కారు వెంటనే చేనేత కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు, వలస కూలీలకు నెలకు ఐదు వేల రూపాయలు, 30 కేజీల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో 20 శాతం కోత విధిస్తూ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వెంటనే రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ