మహబూబాబాద్‌లోని గిరిజన వసతి గృహ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధర్ థెరిస్సా సెంటర్లో రాస్తారోకో చేశారు. హాస్టల్లో కనీస వసతులు కల్పించాలని, అధికారులు వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. 80 మంది విద్యార్థులకు 3 గదులే ఉన్నాయన్నారు. మరుగుదొడ్లు సరిపడా లేకపోవడం వల్ల బయటకు వెళ్తున్నామని తెలిపారు. విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : స్వదేశానికి చేరిన సమీనా