ETV Bharat / state

'నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి'

author img

By

Published : Feb 6, 2021, 9:21 PM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో కొత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ టీవీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

SP Nandyala Kotireddy inaugurated the newly established Community CCTV Command Control Room at Mahabubabad District Maripada
'నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి'

సీసీ టీవీ కెమెరాలతో నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ టీవీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన ప్రారంభించారు.

దాతల సహకారంతో..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. దాతల సహకారంతో రూ.11 లక్షలతో 64 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం కంట్రోల్‌ రూమ్‌ నుంచి కెమెరాల ద్వారా పట్టణాన్ని పరిశీలించిన ఎస్పీ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడుతాయన్నారు. మూడు జిల్లాల కూడలిగా పేరొందిన మరిపెడ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నేరాలు సైతం అదే రీతిలో ఉండే అవకాశం ఉందని.. వాటి నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి అన్నారు. గతంలో చోరీలకు పాల్పడిన నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, సీఐ సాగర్‌, ఎస్సై అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కోబ్రా దళంలోకి మహిళా కమాండోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.