మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో కలియ తిరుగుతూ రోడ్ల వెడల్పును మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కొలతల మార్కింగ్‌లను పరిశీలించారు.
1960 మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లను త్వరితగతిన విస్తరింపజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్ రంజిత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.