ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ ప్రకటించాయి. దీని వల్ల ఎలాంటి పనులు దొరక్క నిరుపేదలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ సమయంలో రంజాన్ మాసం రావడం వల్ల ముస్లిం పేదలు పండుగను జరుపుకోకుండా ఇబ్బందులు పడకూడదని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేశారు.
లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలను అందజేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది రంజాన్ పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఆటోడ్రైవర్ చేసిన పెట్రోల్ దాడిలో.. హెల్త్‌వర్కర్ మృతి