మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ హత్యోదంతానికి నిరసిస్తూ నిందితులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. స్త్రీలను అత్యంత గౌరవించే భారతదేశంలో.. ఆడపిల్లలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళలు ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలన్నారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు