మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులకు రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు అందజేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించట్లేదని వాపోయారు. రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి వేసారినందునే ధర్నా చేపట్టామని తెలిపారు. పట్టా పాసు పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయని, వాటిని సరిచేసి త్వరలోనే రైతులందరికీ పాసు పుస్తకాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో... రైతులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: '5 నెలలుగా రాహుల్ అపాయింట్మెంట్ లేదు'