మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన దివ్యాంగుడు షేక్ ఖాసీంకు 2010 సంవత్సరం నుంచి ఫించన్ వస్తోంది. కాగా ఇతడి తాత పేరు కూడా షేక్ ఖాసీం. అతను చనిపోయాడు. అయితే సిబ్బంది గ్రామంలో సర్వేకి వచ్చిన సందర్భంలో తాను మరణించినట్లు పేర్కొంటూ ఆరు నెలలుగా పింఛను నిలుపుల చేశారంటూ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఎంపీడీవో రవీందర్రావును వివరణ కోరగా.. దివ్యాంగుడి పింఛన్ విషయమై పూర్తి నివేదికను డీఆర్డీవోకు పంపించామని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష