ETV Bharat / state

పల్లెను ప్రగతి బాట పట్టిద్దాం..!! - palle-pragathi-program-in-mahaboobabad-district

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అంటారు జాతిపిత మహాత్మా గాంధీ.. దేశ ఉజ్వల భవిత పల్లెల సమగ్రాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. దేశ జనాభాలో 70 శాతం గ్రామీణ నేపథ్యం కలిగిన కుటుంబాలే. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్, తరువాతి అధికారి పంచాయతీ కార్యదర్శి స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ అవకాశాలను ఒడుపుగా పట్టుకోవాలి. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ పల్లెల్ని అందంగా తీర్చిదిద్దుకునే వెసలుబాటు కలిగింది. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 1653 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఇంచుమించు అంతే సంఖ్యలో ఉన్న పంచాయతీ కార్యదర్శులపైనే గురుతర బాధ్యత ఉన్న నేపథ్యంలో ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం

పల్లెను ప్రగతి బాట పట్టిద్దాం..!!
పల్లెను ప్రగతి బాట పట్టిద్దాం..!!
author img

By

Published : Sep 30, 2020, 7:52 AM IST

మహబూబాబాద్​ జిల్లాలో పంచాయతీకో నర్సరీ ఏర్పాటు చేసి పల్లెకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. తద్వారా అటవీ విస్తీర్ణం పెంచుతూనే పల్లెల్లోనూ పచ్చదనం పెరగాలన్నదే ముఖ్యోద్దేశం. 85 శాతం మొక్కలు బతికేలా సర్పంచులు, కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.

పల్లె ప్రగతి రాష్ట్ర మానస పుత్రిక..

- డీఎస్‌.రెడ్యానాయక్‌, ఎమ్మెల్యే, డోర్నకల్‌

ఈసారి గ్రామాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్పంచులు అదృష్టవంతులు. సీఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లె ప్రగతి అమలు, నెలనెలా నిధులు విడుదల, ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు నెలకొల్పుతున్న తీరు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పల్లె ప్రగతి మానస పుత్రిక. ఇది అన్ని రకాల సమస్యలను దూరం చేసి, ఆరోగ్యకర సమాజం ఏర్పాటుకు దోహదం చేస్తుంది. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలను సొంతింటిలా భావించి అభివృద్ధి చేసుకుంటుండటం వలనే పల్లె ప్రగతికి నిండుతనం సమకూరింది.

పోటీతత్వం పెరగడం శుభ పరిణామం..

- కె.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో, డోర్నకల్‌

పల్లె ప్రగతి అమల్లో పోటీతత్వం నెలకొంది. ఇదొక శుభ పరిణామం. ఫలానా గ్రామ పంచాయతీలో పనులు బాగా జరుగుతున్నాయని భావిస్తే అక్కడికి ఇతర గ్రామ పంచాయతీల కార్యదర్శులను పంపుతున్నాం. పల్లె ప్రగతి పనుల ప్రజాదరణ చూరగొంటుండటం మరో విశేషం.

రైతు వేదికలు

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలు అందించడానికి గ్రామాలను విభజించి పాలన సౌలభ్యానికి క్లస్టర్లను ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో రైతు వేదికల నిర్మాణం మొదలెట్టారు. వ్యవసాయ విస్తరణాధికారులు అందుబాటులో ఉండే వెసలుబాటు కలుగుతుంది. రైతుకు సాగు వివరాలు తెలుసుకునే వీలవుతుంది.

వర్మి కంపోస్టు/ డంపింగ్‌ యార్డు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఊరూరా వర్మి కంపోస్టు షెడ్లు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటవుతున్నాయి. తడి, పొడి చెత్తను వేరు చేసి షెడ్డులో ఏర్పాటు చేసిన వివిధ రకాల గదుల్లో వేర్వురుగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఇంటింటికి ఇచ్చిన బుట్టలను గ్రామస్థులు చెత్త వేయడానికే ఉపయోగిస్తున్నారా?లేదా? పరిశీలించారు. ఆరు బయట చెత్త పడేయకుండా అవగాహన పెంపొందించాలి.

కర్షక కల్లాలు..

చేతికి అందిన పంటలను కల్లాలు లేక రోడ్లపైనే ఆరబెట్టుకుంటున్నారు రైతులు. ఈ అవస్థని ప్రభుత్వం గుర్తించి వాటి నిర్మాణానికి రైతు తన వాటా కింద పది శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితం. దీని గురించి ఈపాటికే కొంత అవగాహన కల్పించినా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినందున కార్యరూపం దాల్చేలా చూడాలి. పార్టీలకతీతంగా చేయూత అందిస్తేనే మేలు ఉంటుంది.

వైకుంఠధామం..

దహన సంస్కారాలకు ప్రతి పల్లెలో వైకుంఠధామం నెలకొల్పుతున్నారు. ఇందులో దహన వాటిక, బంధుమిత్రుల కోసం మూత్రశాలలు, నిరీక్షణ ప్రదేశం, నీటి వసతులు ఉండాలన్నది లక్ష్యం. అంతిమ యాత్ర నిర్వహణకు వైకుంఠ వాహనం సమకూర్చేందుకు చొరవ తీసుకోవాలి. మొక్కలు నాటితే భావితరాలకు ఆదర్శంగా ఉంటుంది.

పల్లె ప్రకృతి వనం..

పల్లెల్లో ఒకప్పటి పచ్చదనం తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వనాల ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా ఎకరానికి నాలుగు వేల మొక్కలు నాటడం, ప్రతి వనంలో నడక దారితో పాటు నీడనిచ్చే మొక్కలు, చిన్న మొక్కలు, పూల మొక్కల పెంచుతారు. వనాల ఏర్పాటుకు పని చేస్తున్న కూలీలకు ఉపాధి హామీ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారు.

పులకరింత..

డోర్నకల్‌ మండలం జోగ్యాతండాలో ముస్తాబవుతున్న పల్లె ప్రకృతి వనం. గ్రామ సర్పంచి ఆంగోతు సరోజ చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. సమీపాన చెరువు, దానికి ఆనుకుని ఉన్నట్లు పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతోంది. మొక్కలు నాటడంతో పాటు చుట్టూ ట్రాక్‌ నిర్మించారు. మారుమూల తండాలో ఈ తరహా స్పందన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.

అదరహో..

డోర్నకల్‌ మండలం బొడ్రాయితండాలో కంపోస్టు యార్డు ఇది. చెత్తను వేరు చేసే ప్రదేశంతో పాటు ప్లాస్టిక్‌, గాజు, కాగితం, మెటల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను వేర్వేరుగా నిల్వ చేసేలా సర్పంచి గమ్మి దగ్గరుండి పర్యవేక్షించారు.

ఇంకుడు గుంతలు..

పల్లెల్లో అస్తవ్యస్తమైన మురుగు కాల్వలు, బహిరంగ మల విసర్జన అంటువ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమయ్యాయి. దీని నివారణకు గతంలో ఇంటికో ఇంకుడు గుంత నిర్మించి వ్యర్థ జలాలను భూమిలోకి ఇంకించి మరుగును నివారించి భూగర్భ జలం పెంచడంతో కొంత పురోగతి కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. సర్పంచి, పంచాయతీ కార్యదర్శి పాత్ర కీలకం. ఎక్కడెక్కడ వీటి అవసరం ఉందో గుర్తిస్తే మీ పల్లె కష్టాలన్నీ దూరమైనట్లే.

ఇదీ చూడండి: ‘స్వచ్ఛ భారత్‌’లో మూడోసారి సత్తాచాటిన తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.