మొత్తం 28 మంది...
తెరాస తరఫున పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి దొమ్మటి సాంబయ్య, భాజపా నుంచి చింతా సాంబమూర్తి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నామపత్రాలు సమర్పించారు. స్వతంత్రులుగా 8 మంది, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు కలసి మొత్తం 28 మంది నామపత్రాలు దాఖలు చేశారు.
5 లక్షల మెజారిటీ ఖాయం...
వరంగల్ పార్లమెంటు స్థానానికి తెరాస అభ్యర్థి పనునూరి దయాకర్ ఆఖరిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఎర్రబెల్లి, కడియం, మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్‌భాస్కర్, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలు ఏకపక్షమేనని... 5 లక్షల మెజారిటీ ఖాయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
ఓటు అనే తూటాతో తెరాసను ఓడించాలి...
భాజపా నుంచి చింతా సాంబమూర్తి కూడా నామపత్రాలు దాఖలు చేశారు. ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, మందాటి, రాకేష్‌రెడ్డి, రావు పద్మ, అశోక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు తప్ప... హామీలను నెరవేర్చట్లేదని విమర్శించారు. ఓటు అనే తూటాతో తెరాసను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వరంగల్‌కు చేసిందేమీ లేదు...
కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య చివరిరోజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జంఘా రాఘవరెడ్డి, ఇందిర, తదితరులతో కలిసి నామినేషన్ దాఖలకు విచ్చేశారు. గతంలో ఎంపీగా పసునూరి దయాకర్‌ను గెలిపిస్తే.. వరంగల్‌కు చేసిందేమీ లేదని గండ్ర విమర్శించారు.
పది మంది స్వతంత్రులు...
మరోవైపు మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి భాజపా అభ్యర్థి జాటోత్ హుస్సేన్, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, తెరాస నుంచి మాలోత్ కవిత నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ నుంచి కల్లూరి వెంకటేశ్వర్లు, జనసేన నుంచి డాక్టర్ భాస్కర్ నాయక్, తెజస నుంచి అరుణ్ కుమార్, న్యూడెమోక్రసీ భూక్య కౌసల్యతో పాటు 10 మంది స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేశారు.
ఎన్ని ఉంటాయో...
చివరిరోజు కోలాహలంగా నామపత్రాల స్వీకరణ ముగిసింది. నేడు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 28 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ జరగనుండగా.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి :మామ అభివృద్ధి మంత్రమే అల్లుడి గెలుపు తంత్రం