మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలతో ఘర్షణ వాతావరణంలో ముగిసింది. రత్తీరాం తండా నుంచి భాజపా తరపున పోటీ చేసి గెలుపొందిన మదన్.. కోనాయికుంట, నల్లగుట్ట తండాలకు రహదారి సౌకర్యం కల్పించాలని అడిగారు. భాజపా నుంచి గెలుపొందడం వల్ల తనపై వివక్ష చూపుతున్నారని.. కావాలనే.. తండాలకు రోడ్డు వేయకుండా, అభివృద్ధి పనులు చేపట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మదన్ వ్యాఖ్యల పట్ల సమావేశంలోని ఇతర అభ్యంతరం చెప్పడం వల్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ సభ్యులకు సర్ది చెప్పిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు తండాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సముదాయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. పరిస్థితిని చక్కదిద్దారు.
ఇవీచూడండి: ఎన్నో ఏళ్ల తరువాత.. మళ్లీ కనువిందు చేస్తున్న జలపాతం