ETV Bharat / state

ఉద్యోగ హామీలను సీఎం కేసీఆర్, పీఎం మోదీ మర్చిపోయారు: సీతక్క - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్, పీఎం మోదీ ఆ తర్వాత మర్చిపోయారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. నోట్ల సంచులతో ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.

mulugu-mla-seethakka-fires-on-cm-kcr-and-pm-mode-in-mahabubabad-mlc-election-campaign
ఉద్యోగ హామీలను సీఎం కేసీఆర్, పీఎం మోదీ మర్చిపోయారు: సీతక్క
author img

By

Published : Mar 9, 2021, 4:34 PM IST

రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగమని సీఎం కేసీఆర్... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పీఎం మోదీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. నోట్ల సంచులు పట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మేధావులు, పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ములుగు జిల్లాలో చిరుత కలకలం.. భయం గుప్పిట్లో జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.