మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లిలో రూ. 1.20 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
విద్యుత్ సమస్య(లో ఓల్టేజీ)తో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరు చేసి ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కేంద్రంతో రైతుల సమస్య తీరిందన్నారు. ఇక నుంచి వారికి నాణ్యమైన విద్యుత్ అందనుందన్న ఎమ్మెల్యే.. రాష్ట్రంలో మంచి రోడ్లు ఉన్న 10 నియోజక వర్గాల్లో డోర్నకల్ నియోజకవర్గం ఒకటని తెలిపారు. ప్రతి గ్రామానికి, శివారు తండాలకు తారు రోడ్లు, సిమెంటు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.