ETV Bharat / state

మహిళలకు, నేతన్నలకోసమే.. బతుకమ్మ చీరలు : మంత్రి సత్యవతి రాఠోడ్

బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలను గౌరవించాలన్న సందేశాన్నిస్తూ.. మరోవైపు నేతన్నల ఆత్మహత్యలు నివారించి.. వారికి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రూపొందించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మల్యాలలో ఆమె మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

Minister Sathyavathi Rathod Distributes Bathukamma Sarees in Mahabubabad
మహిళలకు, నేతన్నలకోసమే.. బతుకమ్మ చీరలు : మంత్రి సత్యవతి రాఠోడ్
author img

By

Published : Oct 10, 2020, 3:31 PM IST

నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ.. ఆడపడుచులను గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రూపొందించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో, మల్యాల గ్రామంలో ఎమ్మెల్యే శంకర్​ నాయక్​, కలెక్టర్ గౌతమ్​లతో కలిసి ఆమె మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రూ.317 కోట్ల రూపాయలు వెచ్చించి.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని.. ఆడపడుచులకు పెద్దన్నగా తోడుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. నేతన్నలు ఉపాధి కల్పిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఆమె తెలిపారు. 285 డిజైన్లలో జిల్లాకు 2 లక్షల 68 వేల చీరలు వచ్చాయని.. మహిళలందరికీ ఆ చీరలు పంచుతామని మంత్రి అన్నారు.

బతుకమ్మ చీరల ద్వారా నేతన్నలు లాక్​డౌన్ సమయంలో కూడా రూ. 25 వేలు ఆదాయాన్ని ఆర్జించారని, భారతదేశం గర్వించదగ్గ సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అంగన్​వాడి కేంద్రాల్లో గర్భిణీలకు ఒకపూట పౌష్టికాహారాన్నిఅందిస్తున్నామన్నారు. కొంతమంది నాయకులు ఎల్​ఆర్​ఎస్​ లేదు.. టీఆర్​ఎస్​ లేదు.. అంటూ గాలిమాటలు మాట్లాడుతున్నారని.. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి: ఆస్తుల నమోదులో ఆధార్ సంఖ్యే కీలకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.