KTR Condolences: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో... మంత్రి సత్యవతి రాఠోడ్ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల సత్యవతి రాఠోడ్... తన తండ్రి లింగ్యా నాయక్‌ను కోల్పోయారు. ఇవాళ దశదిన కర్మ కార్యక్రమానికి... మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. లింగ్యానాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి సత్యవతితో పాటు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
ఫిబ్రవరి 17న..
ఈనెల ఫిబ్రవరి 17న మంత్రి సత్యవతి రాఠోడ్ తండ్రి గుగులోత్ లింగ్యానాయక్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తండ్రి మరణ వార్త విని మేడారం జాతర పర్యవేక్షిస్తున్న మంత్రి... హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తండ్రి పార్థివదేహం వద్ద మంత్రి సత్యవతి కంటతడి పెట్టుకున్నారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బోరున విలపించారు. లింగ్యానాయక్ మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి సత్యవతి రాఠోడ్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: మంత్రి సత్యవతి రాఠోడ్‌కు పితృవియోగం.. పలువురు ప్రజాప్రతినిధుల సంతాపం