మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ వీపీ గౌతమ్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఆంధ్ర పాలకులు బతుకమ్మ పండుగపై వివక్ష చూపేవారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత వల్లే తెలంగాణలో కనుమరుగవుతున్న బతుకమ్మకు ఉత్తేజం వచ్చిందన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మ గురించి తెలియడానికి కారణం కవితేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
గతంలో ఆంధ్ర పాలకులు బతుకమ్మ పండుగపై వివక్ష చూపేవారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బతుకమ్మ చీరల పంపిణీని ఆయన ప్రారంభించారు.