ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను పొట్టనపెట్టుకున్న కిరాతకురాలు అరెస్టు - మహబూబాబాద్​లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన నిందితులు అరెస్టు

మహబూబాబాద్ జిల్లా తిమ్మంపేటలో అక్రమ సంబంధికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులోని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయని డీఎస్పీ నరేశ్​కుమార్​ తెలిపారు.

Mahabubabad police have arrested the accused who killed his wife along with lover
ప్రియుడితో కలిసి భర్తను పొట్టనపెట్టుకున్న కిరాతకురాలు అరెస్టు
author img

By

Published : Jul 22, 2020, 1:52 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం తిమ్మంపేటలో ఈ నెల 9వ తేదీ రాత్రి మేకల ఉప్పలయ్యను అతని భార్య సునీత, అదే గ్రామానికి చెందిన తన ప్రియుడు ఏకాంతాచారిలు కలిసి పథకం ప్రకారం హత్యచేశారు. తమ అక్రమ సంబంధానికి ఉప్పలయ్య అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు నిందితులు దర్యాప్తులో వెల్లడించారు.

కాగా శవాన్ని దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి అంచున ఉన్న చెట్ల పొదలలో పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా అసలు నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. దానితో సునీత, తన ప్రియుడు ఏకాంతాచారిని అరెస్టు చేశామని డీఎస్పీ నరేశ్​కుమార్​ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్​ సిబ్బంది ఆయన అభినందించారు.

ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.