మహబూబాబాద్ పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో 20 టన్నుల నల్లబెల్లాన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు ధ్వంసం చేశారు. 2017- 2020 సంవత్సరం వరకు 130 కేసుల్లో పట్టుబడిన బెల్లమని ఎక్సైజ్ శాఖ సీఐ తెలిపారు.
దీని విలువ సుమారు 12 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నల్ల బెల్లాన్ని ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్, సీఐ కృష్ణ, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.