లాక్డౌన్ వల్ల మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలను వారం రోజులకు ఒకేసారి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ అమలు తీరు, కొవిడ్ రెండో దశ పరిస్థితులపై.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పలు గ్రామాల్లో పండుగలు, శుభకార్యాల పేరిట ప్రజలు గూమిగూడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో 450 మంది సిబ్బందితో 13 చెక్ పోస్ట్లు, 18 పెట్రోలింగ్ బృందాలతో లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన 5,600 మందిపై కేసులు నమోదు చేసి.. 2,100 వాహనాలను సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు