మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విసిరిన గ్రీన్ఛాలెంజ్ను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వీకరించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. ఎస్పీ మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వారిలో డీఎస్పీ నరేష్ కుమార్, రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్ఐ రమేష్బాబులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ఛాలెంజ్ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వీకరించి.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ ఛైర్మన్లకు సవాల్ చేశారు. వారిలో ఇప్పటికే ఎస్పీ, మున్సిపల్ ఛైర్మన్ మొక్కలు నాటారు.
ఇదీ చూడండి : కరోనా నుంచి కోలుకున్న గొంగిడి సునీత దంపతులు