మహబూబాబాద్ జిల్లా తొర్రర్లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ చెరువుగా మారిపోయింది. వర్షపు నీరంతా బస్టాండు ఆవరణలోకి చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండులో నుంచి కనీసం బస్సులు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది.
చిన్నపాటి వర్షం కురిస్తేనే వరద నీరంతా బస్టాండులోకి వస్తోందని ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం