రేపు జరిగే మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలోని 76 వార్డులకు 255 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ప్రతి హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. ఓట్ల లెక్కింపు జరగనున్న గురుకుల పాఠశాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..