ఈ నెల 22వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలు మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్ల ను పూర్తి చేశామని ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. ప్రజలంతా నిర్భయంగా, స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఓటు వేసేందుకు 200 మంది భద్రతా సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా... మద్యం, డబ్బు పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో డీఎస్పీ నరేష్ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉన్నట్టుండి వారి వద్ద అంత డబ్బు ఎక్కడిది?