మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. దంతాలపల్లి మండలం రామాంజపురానికి చెందిన సత్తిరెడ్డి అనే రైతు తన భూమికి చెందిన పాసుపుస్తకం వేరే వారి పేరు మీద నమోదు చేశారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
సంవత్సరం నుంచి కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా.. అధికారులు స్పందించడం లేదని ఆర్డీఓ ఆఫీసు ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.సమీపాన ఉన్న రైతులు అతణ్ని అడ్డుకుని ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.