ఏపీలోని చిత్తూరు నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల నల్లబెల్లం, టన్ను పటికను మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు సీఐ రమేశ్చందర్ వెల్లడించారు. లారీకి ఎస్కార్ట్గా ఉన్న స్విఫ్ట్ కారును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ శివారులోని ఏటిగడ్డ తండాకు చెందిన సుమన్ బెల్లం రవాణాకు ప్రధాన సూత్రధారి అని ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!